![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -801 లో.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వసుధారని రిషి హాస్పిటల్ కి తీసుకొని వస్తాడు. రిషి వసుధారని పట్టించుకుంటూనే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. వేరె లెక్చరర్ కి వసుధారని చూసుకోమని చెప్పి.. అక్కడ నుండి వెళ్లిపోతుంటాడు. మళ్ళీ వచ్చి ఆ మేడంకి డబ్బులు ఇచ్చి వెళ్తాడు. ఆ తర్వాత కాసేపటికి రిషి వెళ్తు.. తనకి దెబ్బ తగిలితే నేనెందుకు స్పందించానని ఆలోచిస్తాడు. ఒక సాటి మనిషి అని అనుకొని స్పందించానని తనకు తనే సర్ది చెప్పుకుంటాడు.
మరొక వైపు వసుధార స్పృహ లోకి వస్తుంది. వసుధార దగ్గర ఉన్న తన తోటి లెక్చరర్ తనకి జరిగిందంతా చెప్తుంది. మేడం మీకు దెబ్బ తగిలినప్పుడు ఎవరు లేకపోతే రిషి సర్ మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకొని వచ్చారు. చాలా టెన్షన్ పడ్డారని ఆ మేడం వసుధారతో చెప్పగానే.. నాకు తెలుసు సర్ నేనంటే మీకు ఇష్టమని, మీరు నన్ను నా ప్రేమని మర్చిపోరని వసుధార అనుకుంటుంది. అప్పుడే వసుధారకి ఏంజిల్ ఫోన్ చేస్తుంది. వేరే మేడం వసుధార ఫోన్ లిఫ్ట్ చేసి ఏంజిల్ తో మాట్లాడుతుంది. వసుధార మేడమ్ కి యాక్సిడెంట్ అయిందని, హాస్పిటల్ లో ఉందని ఏంజిల్ తో ఆ మేడమ్ చెప్తుంది. మరొకవైపు దేవయానితో శైలేంద్ర చాలా ఆవేశంగా మాట్లాడతాడు. "ఎన్ని రోజులు ఇలా వెయిట్ చెయ్యాలి. నా చేతులకి సంకెళ్లు వేస్తున్నావ్" అని శైలేంద్ర అంటాడు. జగతి గురించి తక్కువగా అంచనా వేయవద్దని శైలేంద్రని సమూదాయిస్తుంది దేవయాని. అప్పుడే ధరణి వస్తుంది. ఇప్పటివరకు మేం మాట్లాడుకుందంతా వినేసిందా అని ధరణిపై కోప్పడతాడు శైలేంద్ర. వాళ్ళు మాట్లాడుకున్నది విన్న ధరణి.. వినలేదని శైలేంద్రకి అబద్దం చెప్తుంది. ఆతర్వాత వాళ్ళు మాట్లాడుకున్నది ఎలాగైనా జగతికి చెప్పాలనుకుంటుంది ధరణి.
మరొక వైపు వసుధార దగ్గరికి ఏంజెల్ వస్తుంది. వసుధారకి ఎలా ఉందో తెలుసుకోవాలని రిషి ఆలోచిస్తూ.. ఫోన్ చెయ్యాలా వద్దా అని చూస్తుంటాడు. సాటి మనిషిగా తెలుసుకుంటున్న అని.. వసు దగ్గర ఉన్న మేడమ్ కి ఫోన్ చేసి వసుధార గురించి తెలుసుకుంటాడు. మరొక వైపు వసుధారని ఏంజిల్ తనతో పాటుగా ఇంటికి తీసుకొని వస్తుంది. వసుధార మాత్రం రిషి ఏమంటాడో అని టెన్షన్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |